కృష్ణా: నాయకులు, హీరోలపై అభిమానులు ఒక్కో విధంగా అభిమానాన్ని చాటుకుంటారు. కాగా, ఎమ్మెల్యేపై ఓ యువకుడు అభిమానాన్ని ప్రత్యేకంగా చూపాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చిత్రాన్ని గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్నాడో యువకుడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.