CTR: డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి అలాట్మెంట్ పొందిన విద్యార్థులు బుధవారంలోపు ఆయా కళాశాలల్లో హాజరుకావాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విభాగం పేర్కొంది. శుక్రవారం నుంచి రెండో విడత ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుండగా ఎస్వీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంకా 50 శాతం సీట్లు భర్తీ కావాల్సి ఉంది.