ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకీ ఆసక్తిగా మారుతున్నాయి. త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో…నేతలంతా సమాయత్తమౌతున్నారు. ఏ పార్టీ లో ఉంటే.. భవిష్యత్తు ఉంటుందా అని చాలా మంది నేతలు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఓ సీనియర్ నటుడు.. జనసేలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అతను ఎవరో కాదు నటుడు అలీ. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన… త్వరలోనే జనసేన లో చేరనున్నట్లు సమాచారం.
వైసీపీలో చేరడం వల్ల.. ఎలాంటి పదవులు రాకపోవడంతో… అలీ నిరుత్సాహానికి గురయ్యారట. దీంతో…తనకు బాగా సన్నిహితుడైన పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరమని కొందరు సన్నిహితులు ఇచ్చిన సలహాను పరిశీలిస్తున్నారట. అయితే జనసేనలో కూడా ఏపాటి ఆధరణ ఉంటుందనే విషయంలోనే కాస్త వెనకాడుతున్నట్లు సమాచారం. గతంలో ఆలీ టీడీపీలో కూడా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే అందులో సరైన గుర్తింపు దక్కలేదన్న అసంతృప్తితోనే పార్టీ మారారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవుతుండటంతో దిక్కుతోచటం లేదు.
ఇక్కడ విషయం ఏమిటంటే పార్టీలోకి రమ్మని ఆలీని ఎవరు పిలవలేదు. తనంతట తానుగానే ఏదో ఆశించి వైసీపీలో చేరారు. ఏదో ఆశించే చేరారు కాబట్టి ఆశించింది దక్కకపోవటంతో అసంతృప్తి మొదలైంది. ఇందులో మీడియా పాత్రకూడా చాలానే ఉంది.
ఒకసారి జగన్ ను కలవగానే ఇంకేముంది ఆలీకి రాజ్యసభ ఖాయమని ఒకసారి, ఆలీకి ఎంఎల్సీ విషయంలో జగన్ హామీ ఇచ్చారని తెగ వార్తలు వచ్చాయి. కానీ రియాలిటీలో అదేమీ జరగలేదు. మరి ఆయన నిజంగానే జనసేనలోకి వస్తారా..? అక్కడైనా ఆయనకు కీలక పదవి దక్కుతుందో లేదో చూడాలి.