chandrababu:48 రకాల పన్నులు వేసిన దొంగ జగన్, చంద్రబాబు విసుర్లు
chandrababu:సీఎం జగన్పై (jagan) ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (chandrababu) ఫైరయ్యారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ రోజు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా అండగా నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ (tdp) అని స్పష్టం చేశారు.
chandrababu:సీఎం జగన్పై (jagan) ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (chandrababu) ఫైరయ్యారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ రోజు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా అండగా నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ (tdp) అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందని విమర్శించారు. నాలుగేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజలు ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నారని గుర్తుచేశారు.
ప్రజలు కష్టాల్లో ఉంటే జగన్ (jagan) మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడని చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అన్నారు. ఇది సైకో గుణం అని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. అధికార యంత్రాంగం, రౌడీలను ఉపయోగించి ప్రజల అభిప్రాయాలను జగన్ మార్చాలని అనుకుంటున్నాడని నిప్పులు చెరిగారు. ఏ ప్రయత్నం చేసినా.. జగన్ ఇంటికి పోవడం వెయ్యి శాతం ఖాయం అని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో అధిక ధరలు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. అధికారం అనే రాయితో ప్రతిపక్షాలనే కాదు ప్రజలను కొడుతున్నాడని తెలిపారు.
సీఎం జగన్ (jagan) ఏం చేస్తున్నాడో తెలియదు అని.. ఏం చేయాలో అర్థం కావడం లేదని సెటైర్లు వేశారు. జగన్ను చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీలు ముందుకు రావడం లేదన్నారు. జగన్ చూసి పిక్ పాకెట్ గాళ్లు, పేటీఎం బ్యాచ్ వాళ్లు వస్తారని సెటైర్ వేశారు. టీడీపీ అంటే సంక్షేమం, అభివృద్ధి, వ్యవసాయం, మహిళల రక్షణ అని చంద్రబాబు (chandrababu) వివరించారు. వైసీపీ అంటే దొంగ మద్యం, జే బ్రాండ్లు (j brand), బ్లేడ్ బ్యాచ్ (blade batch) అని విమర్శించారు. రాష్ట్రంలో ఏడు సార్లు విద్యుత్ చార్జీలు (power charge) పెంచారు… తాను ఎప్పుడైనా కరెంట్ చార్జీలు పెంచానా? లోటు బడ్జెట్ ఉన్నా పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ చార్జీలు పెంచకుండా పాలించిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్రంలో 48 రకాల పన్నులు (48 type tax) వేసిన ఘనుడు ఘరానా దొంగ జగన్ మోహన్ రెడ్డి అని విమర్శించారు. మమ్మల్ని నమ్ముకున్న ప్రజలు ఇంత నిస్సహాయ స్థితిలో ఉంటే ఏం చేయలేకపోతున్నామనే బాధ ఉందన్నారు. అటు నారా లోకేశ్ యువగళం పాదయాత్రతో.. ఇటు చంద్రబాబు నాయుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో జనాల్లోకి వెళుతున్నారు. వీరిద్దరికీ ప్రజల నుంచి మంచి స్పందనే లభిస్తోంది.