సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు తీవ్ర అలెర్జీతో బాధపడుతున్నారు. జైల్లో వాతావరణం వేడిగా ఉండటంతో ఆయన డీహైడ్రేేషన్కు గురయ్యారు. ప్రస్తుతం వైద్యులు ఆయన్ని పరీక్షిస్తున్నారు.
Chandrababu: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అలర్జీ(allergy)తో బాధపడుతున్నారు. తీవ్ర ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా ఆయన అలర్జీతో ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. ఈమేరకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి జైలు అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో వైద్య బృందం జైలులోకి వెళ్లి చంద్రబాబును పరీక్షిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు 33 రోజులుగా పోలీసు కస్టడీలో ఉన్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు ఆన కస్టడీని పొడిగించిన విషయం తెలిసిందే. ఇది వరకే చంద్రబాబు సతీమణి ఆయన ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తూ వేడినీళ్లతో స్నానం చేస్తారని, కానీ జైల్లో చన్నీళ్లు, దోమలతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో గత కొన్ని రోజులకు ముందు ఆయనను సీఐడీ అధికారులు విచారించారు. ఆయన ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసు, అంగళ్లు కేసులు విచారణలో ఉన్నాయి. అయితే ఐఆర్ఆర్ కేసులో ఆయన్ని సోమవారం వరకూ అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు స్టే ఇచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనున్నారు.