NLR: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని సోమవారం తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జిల్లాకు సంబంధించిన వివరాలను మాజీ సీఎం జగన్ అడిగి తెలుసుకొని, కార్యకర్తలకు నాయకులు అందుబాటులో ఉండాలని మాజీ CM తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత కాకాని పూజిత తదితరులు పాల్గొన్నారు.