ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మంగళవారం అర్బన్ టీడీపీ కార్యాలయంలో క్లస్టర్, యూనిట్ ఇంఛార్జ్‌లతో సమావేశమయ్యారు. పార్టీ నాయకులు ప్రజలకు అండగా ఉంటేనే పదవులు వస్తాయని ఆయన సూచించారు. విభేదాలు వీడి సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో పనిచేస్తే వచ్చే 15 ఏళ్లు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.