VSP: చోడవరం పట్టణంలోని లాడ్జిలను మంగళవారం పోలీసులు తనిఖీ చేశారు. సీఐ ఆదేశాలను మేరకు ఎస్ఐ నాగ కార్తీక్ పట్టణంలో ఉన్న అన్ని లాడ్జిలలో తనిఖీ నిర్వహించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. రికార్డులు నిర్వహణ సరిగ్గా ఉండాలని యజమానులకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లాడ్జిల్లో బస చేసినట్లయితే సమాచారం అందజేయాలన్నారు.