PLD: సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నంబర్ వన్‌గా ఉందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. మాచర్లలోని 1వ, 15వ వార్డుల్లో శనివారం ఆయన లబ్ధిదారులకు పింఛన్ నగదు పంపిణీ చేసి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సముచిత పింఛన్లు అందిస్తూ రాష్ట్రంలో ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు.