VSP: జీకే వీధి మండలం ఆర్వీ నగర్ జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతికి కారణమైన లారీ డ్రైవర్‌కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.గోవర్ధన్ మంగళవారం తీర్పు ఇచ్చారు. 2017 ఏప్రిల్ 19న ఆర్.వీ నగర్ జంక్షన్ వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. అనంతరం లారీ డ్రైవర్ కిందికి దూకడంతో లారీ ఇంటిని ఢీకొట్టింది.