ATP: కుందుర్పి మండలం బెస్తరపల్లిలో వచ్చే నెల 7న జరగనున్న సవారమ్మ దేవి జాతర మహోత్సవానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డిని ఆహ్వానించారు. బడుగు బలహీన వర్గాల నేత బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి బుధవారం ఉదయం అనంతపురంలోని మాజీ ఎంపీ నివాసంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.