CTR: తొట్టంబేడు మండలం, చియ్యం వరం గ్రామంలో పాముకాటేసిందని వెంకటేష్ అనే వ్యక్తి పాము తలను కొరికిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మద్యం సేవించి ఇంటికి వెళుతున్న వెంకటేష్‌ను పాము కాటు వేసింది. కోపోద్రికుడైన వెంకటేష్ పాము తలను కొరికి ఇంటికి తీసుకెళ్లి పక్కనుంచుకొని నిద్రపోయాడు. గురువారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలించారు.