SS: ధర్మవరం పోలీస్ పరిధిలో గల పలు దేవాలయాల్లో జరిగిన దొంగతనాల కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు SI పి.శ్రీనివాసులు తెలిపారు. చిగుచెర్ల వీరముద్రయ్య స్వామి గుడి, గొట్లూరు మహంకాలమ్మ గుడి, పెద్దమ్మ గుడి, రాంపురం సత్యమ్మ గుడిల్లో దొంగతనాలు జరిపిన నిందితుల వద్ద నుంచి 30 వెండి గొడుగులు, 3 గ్రాముల బంగారు తాళిబొట్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.