అల్లూరి: చింతపల్లి మండలంలోని ఆంధ్ర కాశ్మీర్‌గా పేరొందిన లంబసింగి పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటక సీజన్ ప్రారంభం కావడంతో పాటు వీకెండ్ ఆదివారం కావడంతో పర్యాటకులు లంబసింగి ప్రాంతంలో సందడి చేశారు. మంచు అందాలు ఆస్వాదించారు. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద మంచు మేఘాల అందాలను తనివితీరా ఆస్వాదించారు. తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు.