SkLM: సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామం నుంచి ఆముదాలవలసతో పాటు ఇతర గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు భారీగా పెరిగాయి. ఇవి దట్టంగా పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడక చోదకులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.