కృష్ణా: మంత్రి లోకేశ్‌ను ఉండవల్లిలో ఆంధ్రప్రదేశ్ మాదిగ వెల్పేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనను మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించటంపై హర్షం వ్యక్తం చేస్తూ లోకేశ్‌కు మునియ్య కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఇంత గొప్ప పదవిని ఇచ్చినందుకు బాధ్యతాయుతంగా పనిచేస్తానని మునియ్య తెలియజేశారు.