VSP: సీఐటీయూ అఖిలభారత మహాసభల సందర్భంగా ఆదివారం జగదాంబ సెంటర్లో జరిగిన మహా ప్రదర్శనకు ఏఐటీయూసీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ, రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, జిల్లా అధ్యక్షుడు మన్మధరావు, ప్రధాన కార్యదర్శి జి.ఎస్.జే. అచ్యుత్ రావు ఆధ్వర్యంలో పూలు జల్లి, కరచాలనం చేస్తూ సంఘీభావం తెలిపారు.