VSP: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ఈ నెల 18న విశాఖ నుంచి చర్లపల్లికి (08549/50) ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ కుమార్ తెలిపారు. 18 సాయంత్రం విశాఖలో 7:45కు బయలుదేరుతుంది. దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు మీదుగా మరుసటి రోజు తెల్లవారి 7 గంటలకు చర్లపల్లి చేరుతుంది.