కృష్ణా: అల్పపీడన ప్రభావంతో సముద్రపు అలలు ఎగిసిపడుతున్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాలకాయ తిప్ప వద్ద ఉన్న హంసలదీవి బీచ్‌ను బుధవారం నుంచి రెండు రోజులపాటు మూసివేస్తున్నారు. ఈ మేరకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని ఆమె కోరారు.