Varun Tej : పొరుగు తెలుగు రాష్ట్రంల ఏపీలో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. క్షణం తీరిక లేకుండా అగ్ర నాయకుల నుంచి చోటా మోటా నాయకులు క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ తరపున పలువురు సెలబ్రిటీలు ప్రచారం నిర్వహిస్తున్నారు. పవన్ తరపున హైపర్ ఆది, గెటప్ శీను తదితరులు కూడా ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు తనయుడు, నటుడు వరుణ్ తేజ్ శనివారం పిఠాపురంలో సందడి చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, పురుహూతికా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మెగా అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సాయంత్రం గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో రోడ్‌షోలో పాల్గొన్నారు.
బాబాయ్ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా కుటుంబ సభ్యులంతా తన వెంట ఉంటారని వరుణ్ తేజ్ మీడియాకు తెలిపారు. సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాబాయ్ పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాలను ఎంచుకున్నట్లు చెప్పారు. బాబాయిపై ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలపై వరుణ్ తేజ్ స్పందిస్తూ.. నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించరు. ఓ వైపు సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే బాబాయ్ పవన్ కళ్యాణ్ తరపున ప్రచారంలో పాల్గొంటామని వెల్లడించారు.