ATP:దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు శనివారం గుంతకల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకుడు అమ్మవారి మూలమూర్తికి పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయావరణంలో శ్రీ లక్ష్మీ నారాయణ, సుదర్శన హోమం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మంగళహారతి పూజలు నిర్వహించారు.