AKP: నర్సీపట్నం న్యాయస్థానాల ఆవరణలో సోమవారం సాయంత్రం సీనియర్ సివిల్ జడ్జి పి.షియాజ్ ఖాన్ వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. న్యాయవిజ్ఞానం మీద విద్యార్థుల ప్రతిభ వెలికి తీసేందుకు పోటీలు ఉంటాయన్నారు.