CTR: జిల్లాలో బుధవారం కొత్తగా రెండు స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు అయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. చిత్తూరు రూరల్ మండలంలోని తుమ్మిందలో ఒకటి, జీడీ నెల్లూరులోని వేల్కూర్లో మరో కేసు నమోదైందని వెల్లడించారు. ఆ గ్రామాలలో అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించినట్టు వెల్లడించారు.