NLR: బుచ్చిరెడ్డిపాలెం ఇస్కపాలెం గ్రామంలో ఆదివారం వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్య పడొద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆయనతో పాటు కోవూరు నియోజకవర్గ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.