కృష్ణా: ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు గుడివాడలో ఆర్డీవో బాలసు బ్రహ్మణ్యంకు గురువారం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న మెస్ చార్జీలు పెంచాలని, గత ప్రభుత్వం బకాయి పడ్డ రూ.6,400 కోట్ల విద్యార్థులకు అందించాలని, సంక్షేమ హాస్టల్స్‌కు సోంత భవనాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.