NLR: నూతనంగా బాధ్యతలు చేపట్టిన విడవలూరు ఎస్సై నరేష్‌ని బుధవారం జనసేన పార్టీ మండల అధ్యక్షులు కమతం శ్రీనాథ్ యాదవ్ కలిశారు. శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులతో పాటు విడవలూరు మండల ప్రధాన కార్యదర్శి బి. శ్రీనివాసులు, డిజే వెంకటేష్, హరి, రాజా తదితర జనసైనికులు పాల్గొన్నారు.