కృష్ణా: 2014-19 టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని మరిపించేలా విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. మంగళవారం ఆయన తూర్పు నియోజకవర్గంలో 8వ డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యం అని అన్నారు.