CTR: కార్వేటినగరం (M) బట్టువారిపల్లి సమీపంలోని కుశస్థలి నదిలో బుధవారం ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. GD నెల్లూరు(M) మహదేవ మంగళం గ్రామానికి చెందిన విజయ్ కుమార్ బెంగళూరులో ఉంటున్నాడు. చొక్కమడుగులోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. స్నేహితులతో కలిసి నది వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు నదిలో జారిపడి మృతి చెందాడు. SI రమేశ్ నాయక్ కేసు నమోదు చేశారు.