VZM: జేసీబీ చోరీ కేసులో శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం శివరాంపురం గ్రామానికి చెందిన బి. హరికృష్ణను గురువారం అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ నారాయణరావు, ఎస్ఐ యలమల ప్రసాదరావు, ఏఎస్ఐ అప్పారావు తెలిపారు. రామభద్రపురంలోని టీబీఆర్ సినిమా హాల్ వద్ద తారాపురం గ్రామానికి చెందిన ఎ. శివకు చెందిన జేసీబీని ఉంచగా చోరీ చేశారని చెప్పారు.