GNTR: పట్టణంలోని బ్రాడీపేట శారదానికేతన్ ప్రభుత్వ పాఠశాలను డీఈవో సలీమ్ బాషా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా ఉపాధ్యాయులు బోధించాలని సూచించారు. విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం విద్యార్థులతో సరదాగా గడిపారు.