ATP: పామిడి మండలం జి.కొట్టాల గ్రామానికి చెందిన సుదర్శన్ అనే రైతుకు చెందిన గడ్డివాము మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ శివుడు యాదవ్ వారి స్వగ్రామానికి వెళ్లి తగలబెట్టిన గడ్డివామును పరిశీలించారు. అనంతరం రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.