E.G: రాజమండ్రి రూరల్ రాజానగరం, అనపర్తి, జగ్గంపేట ప్రాంతాల్లో గ్యాస్ కొరతపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 24 గంటల్లో వచ్చే సిలిండర్లు ఇప్పుడు నెల రోజులు పడుతున్నాయని అంటున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లో మధ్యాహ్న భోజనం వంటలు అంతరాయం కలుగుతున్నాయి. గ్యాస్ లేక కట్టెలతోనే వంటలు చేయాల్సి వస్తోందని సిబ్బంది అంటున్నారు.