ATP: రాయదుర్గం ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆదాయ లక్ష్యం రూ.1.76 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.81.84 లక్షలు వచ్చినట్లు ఆర్ఎంసీ కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయడంతో ఆదాయం తగ్గిందన్నారు. చెక్‌పోస్టుల ద్వారా ఆదాయం వస్తోందని, అభివృద్ధి పనులకు రూ.1.35 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.