GNTR: పత్తి కొనుగోళ్ల ప్రక్రియను సులభతరం చేసేందుకు రైతులు CM యాప్లో (CM APP) తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. ఈ మేరకు నిన్న వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీసీఐ (CCI) ద్వారా క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర అందిస్తున్నట్లు పేర్కొన్నారు.