గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాలో మీసేవ నిర్వాహకులకు గత ఐదు నెలలుగా కమిషన్లు అందడం లేదు. రామ్ ఇన్ఫో ప్రతినిధులను ఎన్నిసార్లు అడిగినా స్పందన కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో, సమస్య పరిష్కారం కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.