ప్రకాశం: కనిగిరి పట్టణంలోని పలు లాడ్జీలను బుధవారం తెల్లవారుజామున ఎస్సై మాధవరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాడ్జిలలోని రికార్డులను ఎస్సై పరిశీలించారు. లాడ్జీలలో ఉండే వ్యక్తుల వివరాలను తప్పక రికార్డులలో నమోదు చేయాలని నిర్వాహకులకు ఎస్సై సూచించారు. అనుమానిత వ్యక్తుల సమాచారం పోలీసులకు అందించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు లాడ్జిలను వేదిక చేస్తే చర్యలు తప్పన్నారు.