NLR: నగర శివారులోని భగత్ సింగ్ కాలనీలో శనివారం మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని మండల పరిషత్ పాఠశాలకు సంబంధించిన సమస్యలను HM, విద్యార్థులు మంత్రికి ఏకరువు పెట్టారు. పాఠశాల పరిసరాలను పరిశీలించిన మంత్రి వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి విశాలంగా ఉన్న పాఠశాల మైదానంలో ఆట వస్తువులు ఏర్పాటు చేయాలన్నారు.