E.G: మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నూతన మండలి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడారు. టీడీపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే విధంగా త్వరలో వచ్చే ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.