KRNL: కల్లూరు మండలం మార్కాపురం తడకనపల్లె గ్రామాల్లో రేషన్ దుకాణాల్లో డీలర్లను తొలగించడానికి టీడీపీ నాయకులు దౌర్జన్యంగా అక్రమ కేసులు పెడుతున్నారని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.