SKLM: కేవలం 22 నెలల అతి చిన్నవయసులోనే మందస మండలం డిమిరియా గ్రామానికి చెందిన సీర మయూరి అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఏకధాటిగా 15కు పైగా శ్లోకాలను ఆలపించి నోబుల్ వరల్డ్ రికార్డ్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కైవసం చేసుకుంది. మయూరి తండ్రి సీర సంజీవ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా, తల్లి డా. శాంతి వైద్యురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.