కోనసీమ: నవజనార్దన క్షేత్రాల్లో పేరుగాంచిన మండపేట భోగ జనార్ధన స్వామి వారి తెప్పోత్సవం ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కామేశ్వరరావు తెలిపారు. వచ్చే నెల 2వ తేదీ ఆదివారం సాయంత్రం 6.30 నిమిషాలకు రదంగుడి నుంచి పురవీదులు గుండా బురుగుంట చెరువు వద్దకు శ్రీ దేవి, భూదేవి సమేతుడై జనార్ధన స్వామి చేరుకుంటారన్నారు.