NLR: కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని శుక్రవారం వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా నియమించబడ్డ కాటా సురేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో ఆయనను కలిసి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందజేశారు. తనకు పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.