KRNL:హొళగుంద మం. నెరణికి, కొత్తపేట గ్రామాలకు చెందిన 25 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు SI దిలీప్ కుమార్ తెలిపారు. బుధవారం ఈ కేసులు నమోదు చేయగా, వారిని MRO ఎదుట పూచీకత్తుపై విడుదల చేశారు. వచ్చేనెల 2న జరిగే దేవరగట్టు దసరా బన్ని ఉత్సవం సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.