»Atrocious Fans Fight That Took Life Pawans Fan Was Killed
Fans War : ప్రాణం తీసిన ఫ్యాన్స్ గొడవ..పవన్ అభిమాని హతం
వెస్ట్ గోదావరి జిల్లా అత్తిలిలో ఫ్యాన్ వార్ తో దారుణం జరిగింది. తమ అభిమాన హీరోల గురించి ఇద్దరు పెయింటర్ల మధ్య ఘర్షణ తలెత్తి… అది కాస్తా హత్యకు దారితీసింది
అభిమాన నటుల వీడియో స్టేటస్ (Video Status) విషయంలో జరిగిన వివాదం హత్యకు దారితీసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా (West Godavari) అత్తిలిలో జరిగింది. ఫ్యాన్ వార్ లో దారుణం జరిగింది. తణుకు సీఐ సీహెచ్ ఆంజనేయులు వివరాల ప్రకారం.. ఏలూరుకు చెందిన పెయింటర్లు హరికుమార్, కిశోర్‌లు అత్తిలిలో ఓ ఇంటికి పెయింట్ వెయ్యటానికి మూడు రోజుల కిందట వచ్చారు. హరికుమార్ ప్రభాస్ (Prabhas) అభిమాన సంఘానికి కార్యదర్శిగా ఉన్నాడు. తన వాట్సాప్‌లో (Whats App) ప్రభాస్ వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నాడు. కిశోర్ పవన్ కల్యాణ్ అభిమాని. దీంతో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వీడియోను కూడా స్టేటస్‌లో పెట్టుకోవాలని హరికుమార్కు చెప్పాడు. అందుకు హరికుమార్ ఒప్పుకోలేదు.
దీనిపై ఇద్దరి మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ జరిగింది. చిన్నగా మొదలైన ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి కొట్టుకునేవరకూ వెళ్లింది. హరికుమార్ సెంట్రింగ్ పైపుతో కొట్టడంతో పాటు సిమెంట్ రాయితో ముఖం మీద మోదడంతో కిశోర్ (Kishore) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన అనంతరం హరికుమార్ (Harikumar) పరారిలో ఉన్నాడు. ఇలా జరిగిందని తెలుసుకున్న ఇద్దరు హీరోల అభిమానులు షాకవుతున్నారు. అభిమానం హద్దుల్లో ఉంటేనే అందంగా ఉంటుందని.. పరిధి దాటితే ప్రాణాల మీదకు వస్తుందనటానికి ఇదొక ఉదాహరణకు చెప్పుకోవచ్చు.ఈ మధ్య స్టార్ హీరోల అభిమానుల మధ్య గొడవలు, కొట్టుకోవడాలు ఎక్కువైపోయాయి. అగ్రహీరోల్లో లేని గొడవలు, మనస్పర్థలు అభిమానుల్లో ఎక్కువ అవుతున్నాయి.
ఏదైనా ప్రోగ్రామ్స్, స్టేజ్ మీద స్టార్ హీరోలు కలిసినప్పుడు ఎంతో సంతోషంగా, కలివిడిగా ఉంటారు. ఎక్కడ ఎదురుపడినా చక్కగా మాట్లాడుకుంటారు. కానీ.. అభిమానులు మాత్రం తమ హీరోనే గొప్పని చెప్పుకుంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఒక్కోసారి ఈ ఫ్యానిజం హద్దులు దాటి ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. ఇక సోషల్ మీడియా(Social media)వేదికగా అయితే అభిమానుల మధ్య మాటల యుద్ధానికి హద్దే లేకుండా పోయింది. రంగంలోకి దిగిన తణుకు (Tanuku) రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న హరికుమార్ (Harikumar) ను పట్టుకునే పనిలో పడ్డారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. హీరోల పేర్లు చెప్పుకుని మర్డర్లు చేసుకోవడం షాక్ కి గురి చేసింది. హీరోలపై అభిమానం ఉండటం తప్పు కాదు, కానీ, అభిమానం పేరుతో ఇలా మర్డర్లు చేసుకోవడం ఏంటో అని తలపట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.