సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. పలు అనారోగ్య కారణాల కారణంగా ఆయన కన్నుమూశారు. ఆదివారం అర్ద్రరాత్రి గుండెపోటుకు గురైన కృష్ణ ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ తెల్ల వారు జామున 4 గంటటలకు తుది శ్వాస విడిచారు. కాగా కృష్ణ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా, జగన్, కేసీఆర్ లు సంతాపం వ్యక్తం చేయడం గమనార్హం.
ముుందుగా ఏపీ సీఎం జగన్ కృష్ణను కోల్పోవడం పట్ల తన బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్వీట్ వేదికన కృష్ణ మరణానినికి నివాళి అర్పించారు. ట్వీట్ చేస్తూ.. ‘కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి… ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్ బాబుకు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.’ అని పేర్కొన్నాడు.
కేసీఆర్ సైతం కృష్ణ మృతిపట్ల స్పందించారు. ‘ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత అభిమానులు సూపర్ స్టార్ గా పిలుచుకునే సినీ హీరో కృష్ణ (శ్రీ ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి, 79) మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా కృష్ణ జనాదరణ పొందారని అన్నారు. నాటి కార్మిక కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరో గా, సూపర్ స్టార్ గా సొంతం చేసుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, సినిమా నిర్మాణ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణ దేనన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.’ ట్వీట్ లో తెలిపారు.