కేంద్ర బడ్జెట్ 2023 పై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ లో కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చాయని స్పష్టం చేశారు.
అలాగే.. ఆదాయపు పన్ను శ్లాబ్ రేట్లు కూడా ఊరటనిచ్చాయన్నారు. కొన్ని సెక్టార్లకు తక్కువ కేటాయింపులు చేశారు. ఎరువులు, యూరియా, బియ్యం, గోధుమలు సబ్సిడీకి ఈసారి కేటాయింపులు తగ్గాయి. రోడ్లు, రైల్వేలకు కేటాయింపులు పెరిగాయి కానీ.. వ్యవసాయానికి మాత్రం కేటాయింపులు ఈసారి చాలా తగ్గాయి. కేవలం ఏడు రంగాలకే ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చారు. ఏపీలో అమలవుతున్న పథకాలను అనువుగా కొన్ని నిర్ణయాలను కేంద్రం ఈ బడ్జెట్ లో తీసుకుంది. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ నుంచి వచ్చిన సూచనలను కేంద్రం పరిగణలోకి తీసుకుంది. పంప్ స్టోరేజ్ విధానం గురించి ఇప్పటికే కేంద్రానికి వివరించాం. ఆంధ్ర ప్రదేశ్ ఈ రంగంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ గా ఉంది. అందుకే దీనిపై పాలసీ తేవాలని కోరామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు.