»Ap Cm Jagan Comments Chandrababu Naidu At Anantapur Vasathi Deevena Programme
Jagan: నరమాంసం తినే పులి ముసలిదైపోయింది
చంద్రబాబు(chandrababu naidu) గురించి పరోక్షంగా నరమాంసం తినే పులి ముసలిదైపోయిందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm Jagan mohan reddy) వ్యాఖ్యానించారు. ఈరోజు అనంతపురం జిల్లా నార్సలలో ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన నిధుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు. మరోవైపు చదువుల కోసం ఓ ఒక్కరూ కూడా అప్పులు చేయకూడదని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రోజు కుట్రలు, రాజకీయాల మధ్య బతుకుతున్నామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan mohan reddy) అన్నారు. మరోవైపు వచ్చి రాని ఇంగ్లీషుతో ముసలాయన చంద్రబాబు(chandrababu naidu) జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారని పేర్కొన్నారు. అతని మాటలు వింటుంటే పంచతంత్రం కథ గుర్తుకొస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. అంతేకాదు బాబును పులితో జగన్ పోల్చారు. కానీ అనేక ఏళ్లుగా నరమాంసం తినేందుకు అలవాటు పడ్డ పులి..ప్రస్తుతం ముసలిదై పోయిందని అన్నారు. వేటాడే శక్తి, పరిగెత్తే ఓపిక లేదన్నారు.
ఈ క్రమంలో ఉన్న చోటనే ఉంటూ నక్కలను తోడేస్తుందని అన్నారు. అంతేకాదు మనుషులను తినే ప్లాన్ కూడా చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ పులిని నమ్మామంటే మనల్ని తినేస్తుందని ఎద్దేవా చేశారు. 2014లో బాబు సీఎం అయిన తర్వాత వ్యవసాయ రుణాల మాఫీ సహా అనేక హామీలు అలాగే ఉన్నాయని పేర్కొన్నారు. బాబు వస్తే జాబ్ వస్తుందని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలే లేవని అన్నారు. మరోవైపు సున్నా వడ్డీ రుణాలను కూడా రద్దు చేశాడని జగన్(jagan) గుర్తు చేశారు. వెన్ను పోటు పొడిచే వాళ్లను ఎప్పటికీ నమ్మకూడదని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆర్థికంగా వెనుకబడిన పోస్ట్ సెకండరీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు(students) ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలలో జగనన్న వసతి దీవెన ఒకటి. ఏప్రిల్ 26న అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పలలో సీఎం జగన్ ఈ మేరకు లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను విడుదల చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ ఐదోసారి ఈ జిల్లాకు రావడం విశేషం. ఇప్పటి వరకు రూ.4,275.76 కోట్లు జమ అయినట్లు ప్రభుత్వం విడుదల చేయగా బుధవారం రూ.912.71 కోట్లు జమ అయ్యాయి.
ఈ క్రమంలో అర్హత కలిగిన విద్యార్థులు jnanabhumi.ap.gov.in పోర్టల్ నుంచి జగనన్న విద్యా దీవెన చెల్లింపు స్థితి 2023ని తనిఖీ చేసుకోవచ్చు.