»Ap Cid Issues Notices To Telugu Desam Party Office
AP CID: ఆర్థికమంత్రి బుగ్గన ఫిర్యాదు, టీడీపీ కార్యాలయానికి ఏపీ సీఐడీ.. నోటీసులు
అమరావతిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి మంగళవారం సీఐడీ అధికారులు వెళ్లారు. టీడీపీ జనరల్ సెక్రటరీ పేరిట సీఐడీ నోటీసులను కూడా జారీ చేసింది.
అమరావతిలో (amaravati) ఉన్న ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి (andhra pradesh telugu desam party office) మంగళవారం సీఐడీ అధికారులు వెళ్లారు. టీడీపీ జనరల్ సెక్రటరీ (tdp general secretary) పేరిట సీఐడీ నోటీసులను కూడా జారీ చేసింది. ఆ పార్టీ అనుబంధ పత్రిక చైతన్య రథంలో వస్తున్న వార్తా కథనాలపై సీఐడీ వివరాలు సేకరించింది. ఈ పత్రికకు ఎడిటర్ ఎవరు.. నిర్వహణ బాధ్యతలను ఎవరు చూస్తున్నారు.. అని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత టీడీపీ ప్రధాన కార్యదర్శి పేరుతో లాయర్ కు నోటీసులు ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసుకున్నది. తన పైన చైతన్య రథం పత్రిక తప్పుడు కథనాలు ప్రచురించిందని బుగ్గన చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ కు బుగ్గన సమర్పించిన అఫిడవిట్ లో స్థిర, చర ఆస్తుల పైన కూడా తప్పుడు వార్తలు రాసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పత్రిక పైన ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన సీఐడీ, విచారణ చేపట్టింది.