»Ap Assembly Budget Sessions Fm Buggana To Present Budget Today
AP Assembly Budget sessions: నేడు ఏపీ బడ్జెట్
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నేడు (గురువారం, మార్చి 16) బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 2023-24 వార్షిక బడ్జెట్ రూ. 2.79 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ ఐదో బడ్జెట్ ను ఉదయం ఎనిమిది గంటలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమై ఆమోదం తెలపనుంది.
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నేడు (గురువారం, మార్చి 16) బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 2023-24 వార్షిక బడ్జెట్ రూ. 2.79 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ ఐదో బడ్జెట్ ను ఉదయం ఎనిమిది గంటలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమై ఆమోదం తెలపనుంది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉదయం పది గంటలకు అసెంబ్లీకి సమర్పిస్తారు. శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా బడ్జెట్ ప్రసంగం చేస్తారు. వార్షిక బడ్జెట్ అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. మండలిలో ఈ బడ్జెట్ ను పశు సంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు చదువుతారు.
వివిధ ప్రభుత్వ శాఖలు అడిగినంత మాత్రాన ప్రస్తుత బడ్జెట్ లో నిధులు ఇవ్వబోమని ఇప్పటికే ఆర్థిక శాఖ తెలిపింది. అందుకు తగినట్లుగా ప్రతిపాదనలను తీసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్ని నిధులు ఖర్చు చేయగలమనే వాస్తవికత దృక్పథంతో లెక్కలు వేసి మరీ ప్రతిపాదనలు ఇవ్వాలని గతంలోనే ఆదేశించింది. ఇప్పటికే ప్రభుత్వ అనుమతి ఉన్న వాటికి తప్ప కొత్త వాటికి నిధులు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
గత ఏడాది అంటే 2022-23లో రూ.2.56 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. రూ.1.91 లక్షల కోట్ల రెవెన్యూ రాబడులు వస్తాయని అంచనా వేశారు. కానీ మొదటి పది నెలల్లో.. గత జనవరి వరకు రూ.1.21 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయి. మిగతా రెండు నెలల్లో మరో రూ.30 లక్షల కోట్లు వచ్చినా టార్గెట్ రీచ్ కాదు. బడ్జెట్ సాకారం కావడానికి రుణాలు తీసుకోవాలి. బడ్జెట్ ప్రతిపాదనల విషయాన్ని పక్కన పెడితే… నిధుల రాక ముఖ్యం. అమ్మ ఒడి, రైతు భరోసా, పేదలకు ఇళ్లు, వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వవచ్చు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక కేటాయింపులు ఉండే అవకాశముంది.