అన్నవరం సత్యనారాయణ స్వామి(Annavaram Satyanarayana Swamy) కల్యాణ మహోత్సవం(Kalyana mahotsavam) వేడుకగా జరిగింది. కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక దివ్య కల్యాణోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. సత్యదేవుడు, అనంత లక్ష్మీ అమ్మవారిని పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెను చేసి ఊరేగించారు. దేవతామూర్తులను చూసి భక్తులు తరించారు. మే 6వ తేది వరకూ ఈ కల్యాణోత్సవ(Kalyana mahotsavam) వేడుక జరగనుంది.
వేడుకల్లో భాగంగా మొదటి రోజు సత్యనారాయణ స్వామి(Annavaram Satyanarayana Swamy), అనంతలక్ష్మి అమ్మవార్లను ఆలయ పండితులు వధూవరులుగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముత్తైదువులు పసుపు దంచి కోలాహలంగా భక్తి పాటలు పాడారు. రాత్రి 9 గంటలకు కల్యాణ వేదికపై స్వామివారి దివ్య కల్యాణం(Kalyana mahotsavam) వేడుకగా సాగింది. కల్యాణోత్సవం సందర్భంగా ఆలయానికి భక్తులు వేలాది తరలివచ్చారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
కల్యాణ మహోత్సవం(Kalyana mahotsavam) సందర్భంగా విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నుంచి అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి పండితులు, అధికారులు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. ఇంద్రకీలాద్రి నుంచి కూడా పట్టు వస్త్రాలు తీసుకొచ్చి స్వామివారి(Annavaram Satyanarayana Swamy)కి సమర్పించారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టీవీ, స్క్రీన్ ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.